Skip to main content

Education

Education


1) పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు సాయం చేసింది.  దీనిని ఏ మిషిన్ల ఉత్పత్తికి ఆయన వినియోగించనున్నారు ?
జ: లక్ష్మి ఆసు
2) రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఇండీవుడ్ కార్నివాల్ లో ఏ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది ?
జ: చదువుకోవాలి ( చిత్ర దర్శకుడు మద్దాలి వెంకటేశ్వరరావు)
3) ట్విట్టర్ లో ఎక్కువ మంది అనుసరిస్తున్నభారతీయుల్లో ఎవరు నెంబర్ 1లో ఉన్నారు ?
జ: ప్రధాని నరేంద్రమోడీ ( 3.75 కోట్లు)
4) భారతీయ మార్కెట్లలో ఇంటర్నెట్ వినియోగం పెంచేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్ల కోసం ఓరియో గో ఓఎస్ ను లాంఛ్ చేసిన సంస్థ ఏది ?
జ: గూగుల్
5) ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే ఏ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది ?
జ: ఆకాశ్
(నోట్: 25 కిమీ పరిధి. ఒడిశాలోని చాందీపూర్ ITR నుంచి ప్రయోగించారు )
6) పరిశోధన సామర్థ్యం అభివృద్ధిలో సహకారానికి దక్షిణ మధ్య రైల్వే ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
7) ఆరోగ్య 2017 పేరుతో మొదటి అంతర్జాతీయ ఆయుష్ సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: న్యూఢిల్లీ ( డిసెంబర్ 4 నుంచి – నాలుగు రోజుల పాటు)
8) ఇండియన్ నేవీ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: డిసెంబర్ 4
9) భారత్ లో మొదటి మేడమ్ తుస్సాడ్స్ మైనపు మ్యూజియంను అధికారికంగా ఎక్కడ ప్రారంభించనున్నారు
జ: న్యూఢిల్లీ
10)నేపాల్ లో జరిగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ కు భారత్ బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు
జ: వి.కె.సారస్వత్
11) రోళ్ళపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది
జ: ఆంధ్రప్రదేశ్
12) 6వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ 2017 ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ?
జ: అసోం
13) ఉత్తరప్రదేశ్ లోని ఏ జిల్లాని నేషనల్ కేపిటల్ రీజియన్ (NCR) లో చేర్చారు ?
జ: షామ్లీ జిల్లా ( Shamli District)
14) 2017 వరల్డ్ సాయిల్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Caring for the Planet starts from the Ground
15) నీటిలో కదిలే అతి పెద్ద సోలార్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు
జ: కేరళ
16) ప్రపంచ అత్యుత్తమ ఆలోచనాపరుల జాబితాలో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు ?
జ: భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్
(నోట్: ఫారిన్ పాలసీ మేగజైన్ 2017 ఈ జాబితాను ప్రకటించింది )
17) బంగ్లాదేశ్ లో రిలయన్స్ పవర్ ప్లాంట్ అభివృద్ధి కోసం  583 మిలియన్ డాలర్లు (రూ.3748కోట్లు) రుణం మంజూరు చేసిన బ్యాంకు ఏది ?
జ: ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB)
18)ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ సంస్థను భారత్, ఫ్రాన్స్ కలసి ప్రారంభించాయి.  ఇది చట్టబద్ధ సంస్థగా మారింది.  దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: హరియాణాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో
(నోట్: 2015 ఐరాస్ నిర్వహించిన కాప్ 21 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు చొరవతో ఏర్పడింది )
19) విజిలెంట్ ఏస్ 2017 పేరుతో ఏయే దేశాలు సంయుక్త వైమానిక విన్యాసాలు జరుపుతున్నాయి
జ: దక్షిణ కొరియా, అమెరికా
20) యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కంపాక్ట్ ఆన్ మైగ్రేషన్ నుంచి ఇటీవల తప్పుకున్న దేశం ఏది
జ: అమెరికా
(నోట్: శరణార్ధులకు ఆశ్రయం కల్పించేందుకు 2016 లో ఐక్యరాజ్యసమితి ఓ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీని నుంచి అమెరికా తప్పుకుంది

Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...