Skip to main content

Education

Education

1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ?
జ: 2010 వాషింగ్టన్ లో
(నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి)
2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ?
జ: ఎనిమిది
3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ?
జ: నీతి ఆయోగ్
4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ?
జ: 52.5 శాతం
5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ?
జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్
(నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు )
6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ?
జ: కెన్నెత్ ఇ. జస్టర్
7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ?
జ: అమితాబ్ కాంత్
8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ?
జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు
9) గ్రేటర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత ?
జ: రూ.16,830 కోట్లు
10) హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్థ ఏది ?
జ:  L & T
(నోట్: ప్రపంచంలోనే పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తున్న అతి పెద్ద మెట్రో ప్రాజెక్ట్ ఇదే)
11) మెట్రో రైలు ప్రాజెక్టును మొదట ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2007 మే 14న
12) జాతీయ స్థాయిలో ఉత్తమ అవయవదాన అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన హాస్పిటల్ ఏది ?
జ: యశోదా హాస్పిటల
13) 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు ?
జ: ఎన్ కే సింగ్
(నోట్: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు )
14) 15వ ఆర్థిక సంఘం ఎప్పటి వరకూ కేంద్రానికి నివేదిక అందిస్తుంది ?
జ: 2019 అక్టోబర్
15) ఉగ్రవాదంపై పోరులో సహకరించుకోవాలని భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రష్యాతో
(నోట్: 1993లో ఈ రెండు దేశాలమధ్య కుదిరిన ఒప్పందం స్థానంలో కొత్తది అమల్లోకి వస్తుంది )
16) లవ్ జిహాద్ కేసుగా పరిగణించి ఎవరు చేసుకున్న వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది?
జ: హదియా
17) పంచాయతీయ రాజ్ సంస్థల్లో గెలిచిన మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ
18) సూర్యుడిపై ప్రయోగాలకు భారత్ మొదటిసారి 2019లో పంపుతున్న శాటిలైట్ మిషన్ ఏది  ?
జ: ఆదిత్య L1 మిషన్
19) ఆదిచుంచనగిరి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక
20) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సౌమ్యా స్వామినాథన్
21) మూడోసారి ప్రపంచ స్నూకర్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ?
జ: భారత్ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ పంకజ్ అద్వానీ
22) 2017 IITF ఛాలెంజ్ స్పానిష్ ఓపెన్ సింగిల్స్ లో బంగారు పతకం గెలుచుకున్న సాతియాన్ జ్ఞానశేఖరన్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: తమిళనాడు
23) ఆసియాన్ మారథాన్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు గోపీ తొనకాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: కేరళ

Comments

Popular posts from this blog

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education 1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం 2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ? జ: 11.05 కోట్ల ఎకరాలు 3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ? జ: అర్బన్ జీనీ 4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు? జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది) 5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ? జ: ఎస్.కె. సాహు 6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ? జ: ఐదు గ్రామ పంచాయతీలు 7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి...

Education

Education 1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు 2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి జవాబు:నాణాలు 3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి జవాబు:42 4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు జవాబు:కాళిదాసు 5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు జవాబు:కామందకుని 'నీతిసారం' 6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది జవాబు:నాణాలు 7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది? జవాబు. పాటలిపుత్రం 8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ? జవాబు:దత్తదేవి 9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు? జవాబు:శివుడు 10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు? జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత 11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది? జవాబు:గరుడ 12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు? జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి 13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచి...