Skip to main content

Education

Education

1) మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  దాని పేరేంటి ?
జ: వీ – హబ్
2) మహిళ పరిశ్రమల్లో ప్రభుత్వ పెట్టుబడుల కోసం రూ.15కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిధిని ఏర్పాటు చేస్తోంది ?
జ: టీ – ఫండ్
3) సింధూ నాగరికత తర్వాతవిగా భావిస్తున్న గూడు సమాధులు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ?
జ: వరంగల్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో
4) ఢిల్లీలో జరుగుతున్న ఆదిమహోత్సవ్ లో వివిధ రాష్ట్రాల వంటకాల్లో మన రాష్ట్రానికి చెందిన ఏ వంటకానికి మొదటి బహుమతి లభించింది ?
జ: హైదరాబాద్ దమ్ బిర్యానీ
5) మలేసియాలో ద ఎకనామిక్ టైమ్స్ ఆసియాన్ బిజినెస్ లీడర్స్ కన్ క్లేవ్ లో ద ఎకనమిక్ టైమ్స్ మోస్ట్ ఇన్ స్పైరింగ్ బిజినెస్ లీడర్ ఇన్ ఆసియా అవార్డును ఎవరికి బహుకరించారు ?
జ: జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావుకి
6) GES లో స్టార్టప్ పిచ్ కాంపిటేషన్ లో ఎవరు తుది విజేత (గ్రాండ్ చాంపియన్) గా సాధించారు ?
జ: అజైతా షా (భారత్ )
7) గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ (జిస్ట్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన పిచ్ కాంపిటేషన్ లో భారత్ కు చెందిన అజైతా షా గ్రాండ్ చాంపియన్ గా నిలిచారు. ఆ నిర్వహిస్తున్న స్టార్టప్ ఏంటి ?
జ: ఫ్రాంటియర్ మార్కెట్స్
(నోట్: సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తుల తయారీతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు )
8) రూపాయి నోటుని భారత దేశంలోకి ప్రవేశపెట్టి వందేళ్ళు పూర్తయ్యాయి.  దాన్ని బ్రిటీష్ వారు ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
జ: 1917 నవంబర్ 30న
9) భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ ను బౌద్ధ మతంలోకి మార్చిన బౌద్ధ సన్యాసి మరణించారు. ఆయన పేరేంటి ?
జ: ప్రజ్ఞానంద్
(నోట్: 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించారు )స
10) తమిళనాడు, కేరళల్లో ఓక్కి తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది.  ఓక్కి అనేది ఏ దేశానికి చెందిన పదం ? దాని అర్థం ఏంటి ?
జ: ఓక్కి అనే పేరు బంగ్లాదేశ్ పెట్టింది (ఇది బెంగాలీ పదం), దీనికి అర్థం: కన్ను
11) జనానికి సులువుగా అర్థమవడానికి వీలుగా ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో తుఫాన్లకు  స్థానిక పేర్లు పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది ?
జ: 2000 సంవత్సరం నుంచి
(నోట్: ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆసియా, పసిఫిక్ ఆర్థిక సాంఘిక సంఘం (ఇస్కాప్) నిర్ణయించాయి )
12) ఇప్పుడు ఓక్కి తుఫాన్ తర్వాత వచ్చే తుఫాన్ కు పేరు పెట్టే అవకాశం భారత్ కు వచ్చింది.  దాని పేరేంటి ?
జ: సాగర్
13) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016లో హత్యలు, మహిళలపై నేరాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యాయి ?
జ: ఉత్తరప్రదేశ్ (4889 హత్యల)
(నోట్: రెండో స్థానంలో బిహార్ (2581 హత్యలు) )
14) భారత టుబాకో బోర్డ్ ఇన్ ఛార్జ్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మనోజ్ ద్వివేది
15) ఏపీలోని పోలవరం అథారిటీ CEO గా ఎవరిని కేంద్రం ప్రకటించింది ?
జ: హల్దార్
16) ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో (48 కేజీల విభాగంలో) 22 యేళ్ళ తర్వాత స్వర్ణం సాధించిన భారత మహిళా లిఫ్టర్ ఎవరు ?
జ: మీరాబాయి చాను
(నోట్: గతంలో 1994,95ల్లో వరుసగా కరణం మల్లేశ్వరి స్వర్ణాలు గెలిచింది )
17) భారత్ క్రికెట్ జట్టుతో మ్యాచులైనా ఆడించండి లేదా… రూ.452కోట్లు పరిహారం ఇప్పించండి అని ఐసీసీకి ఫిర్యాదు చేసిన క్రికెట్ జట్టు ఏది ?
జ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)
18) గ్వాలియర్ లోని ఐటీఎం విశ్వవిద్యాలయం ఏ క్రికెటర్ కు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ?
జ: యువరాజ్ సింగ్
19) బీసీసీఐ మహిళల అండర్ 19 టోర్నీ విజేత ఎవరు ?
జ: ఆంధ్రా జట్టు

Comments

Popular posts from this blog

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education 1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం 2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ? జ: 11.05 కోట్ల ఎకరాలు 3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ? జ: అర్బన్ జీనీ 4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు? జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది) 5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ? జ: ఎస్.కె. సాహు 6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ? జ: ఐదు గ్రామ పంచాయతీలు 7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి...

Education

Education 1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు 2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి జవాబు:నాణాలు 3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి జవాబు:42 4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు జవాబు:కాళిదాసు 5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు జవాబు:కామందకుని 'నీతిసారం' 6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది జవాబు:నాణాలు 7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది? జవాబు. పాటలిపుత్రం 8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ? జవాబు:దత్తదేవి 9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు? జవాబు:శివుడు 10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు? జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత 11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది? జవాబు:గరుడ 12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు? జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి 13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచి...