Skip to main content

Education

Education

1) రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాల సమగ్ర వివరాలతో ఉన్న వార్షిక గణాంక దర్శిని -2017ను ఎవరు ఆవిష్కరించారు ?
జ: సీఎం కేసీఆర్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్
2) గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం కింద అందించే నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నందున కేంద్ర తాగునీటి శాఖ ఎంత బోనస్ ఇచ్చింది ?
జ: రూ.145 కోట్లు
3) వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పిడియాట్రిక్ ఆప్తమాలజీ, స్టాబిస్మస్ WCPOS (పిల్ల నేత్ర వైద్యంపై నాలుగో ప్రపంచ సదస్సు ) ఎక్కడ జరుగుతోంది ?
జ: హైదరాబాద్ లో
4) మూడో ఏడాది కూడా ఇండీవుడ్ కార్నివాల్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో
5) అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి కొత్త మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది ?
జ: బెంగళూరులో
6) ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: మూడో స్థానం
(నోట్: ఆగ్నేసియాలో మొదటిస్థానం భారత్ ది )
7) 75 మంది న్యాయమూర్తులు ఉన్న మద్రాస్ హైకోర్టులో రికార్డు స్థాయిలో ఎంతమంది మహిళా న్యాయమూర్తులు బాధ్యతలు నిర్వహించబోతున్నారు ?
జ: 11మంది
8) పశువుల్లో వ్యాధి నిర్ధారణకు భారత వైద్య పరిశోధనా మండలి కొత్త కిట్ ను ఆవిష్కరించింది. దాని పేరేంటి ?
జ: జైడస్ క్యాడిలా
9) ఆరుగురు భారతీయ మహిళా నావికులు చేపట్టిన నావికా సాగర్ పరిక్రమ యాత్ర 7800 నాటికల్ మైళ్ళు ప్రయాణించి ప్రస్తుతం న్యూజిలాండ్ చేరుకుంది.  లెఫ్టినెంట్ కమాండర్ వర్తికాజోషి ఆధ్వర్యంలోని ఈ యాత్రికులు ఏ నౌకపై ప్రయాణిస్తున్నారు ?
జ: INSV తరిణి
10) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఎక్కువ మంది సందర్శించిన భారతీయ కట్టడం ఏది ?
జ: గోల్డెన్ టెంపుల్
11) ఏ దేశంతో నేరుగా విమాన సర్వీసుల కోసం భారత్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: గ్రీస్
12) ప్రకృతి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రష్యా
13) ఇన్పూరెన్స్ ఖాతా పేరుతో మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ అందిస్తున్న దేశంలోని మొదటి ఇన్సూరెన్స్ కంపెనీ ఏది ?
జ:  India First Life Insurance
14) డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి కేటగిరి III-B పొందిన ఎయిర్ లైన్స్ సంస్థ ఏది ?
జ: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్
15) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ధరించిన ఏ నెంబర్ జెర్సీకి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గుడ్ బై చెప్పింది ?
జ: 10వ నెంబర్
16) మీడియా రైట్స్ గుత్తాధిపత్యంపై బీసీసీఐకి కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఎంత జరిమానా విధించింది ?
జ: రూ.52.24 కోట్లు
17) ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్ ప్రకటించిన మొదటి ఎడిషన్ అవార్డుల్లో స్పోర్ట్స్ మన్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి దక్కింది ?
జ: కిదాంబి శ్రీకాంత్
18) 15 ఫ్రేమ్ IBSF వరల్డ్ స్నూకర్ మెన్ ఛాంపియన్షిప్ 2017 గెలుచుకున్న భారతీయ స్నూకర్ ఎవరు ?
జ: పంకజ్ అద్వానీ
19) 300 టెస్ట్ వికెట్లను వేగంగా తీసిన భారతీయ బౌలర్ ఎవరు ?
జ: రవిచంద్రన్ అశ్విన్ (54 tests)
20) అమెరికాలో ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకునే ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది ?
జ: ఉత్తరకొరియా
21) ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి సమాచారాన్ని దొంగిలిస్తున్న ఏ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది ?
జ: టిజి ( TIZI)
22) బ్యాండ్-ఇ అమీర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది ?
జ: ఆఫ్ఘనిస్తాన్
23) ఐక్యరాజ్యసమితికి UK అంబాసిడర్ గా నియమితులైన మొదటి మహిళ ఎవరు ?
జ: కరేన్ పీర్స్
24) ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా 350 బస్సులకు మరమ్మత్తులు చేసేందుకు 2.87 మిలియన్ల డాలర్ల సాయం అందించనున్న దేశం ఏది ?
జ: భారత్

Comments

Popular posts from this blog

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education 1) దక్షిణ భారత పాఠశాక స్థాయి బ్యాండ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థును బృందానికి రెండో స్థానం లభించింది జ: మహేంద్ర హిల్స్ విద్యార్థునుల బృందం 2) రాష్ట్రంలో రైతులు వరి వైపే మొగ్గు చూపిస్తున్నారు. గడచిన రబీ సీజన్ లో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగయ్యాయి ? జ: 11.05 కోట్ల ఎకరాలు 3) స్థానికంగా ఉండే వృత్తి నిపుణుల వివరాలతో ఏ పేరుతో యాప్ ను పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది ? జ: అర్బన్ జీనీ 4) రాష్ట్రంలో మరోసారి పులుల గణనకు ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖాధికారులు. ప్రతి చివరిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు పులులను లెక్కించారు? జ: 2013 లో (నాలుగేళ్ళకోసారి ఈ లెక్కింపు జరుగుతుంది) 5) గోదావరి బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎవరు ? జ: ఎస్.కె. సాహు 6) విలీన మండలాల్లో సమస్యలను అధిగమించేందుకు ఎన్ని గ్రామపంచాయతీలను మార్పిడి చేసుకోవాలని ఏపీ, తెలంగాణ భావిస్తున్నాయి ? జ: ఐదు గ్రామ పంచాయతీలు 7) రాష్ట్రంలో ఏప్రిల్, మే ,2018 లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి...

Education

Education 1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు 2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి జవాబు:నాణాలు 3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి జవాబు:42 4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు జవాబు:కాళిదాసు 5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు జవాబు:కామందకుని 'నీతిసారం' 6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది జవాబు:నాణాలు 7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది? జవాబు. పాటలిపుత్రం 8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ? జవాబు:దత్తదేవి 9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు? జవాబు:శివుడు 10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు? జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత 11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది? జవాబు:గరుడ 12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు? జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి 13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచి...