Skip to main content

Education

Education 

1) తెలంగాణలో పెద్ద పులల సంరక్షణ కోసం ఏ ఏరియాలో పెద్ద పులుల రక్షిత ప్రాంతం ( టైగర్ రిజర్వు ఏరియా) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఏటూరు నాగారంలో అటవీ ప్రాంతంలో
2) ఏయే ప్రాంతాలను కలుపుతూ పెద్దపులులకు భారీ టైగర్ కారిడార్ ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: మహారాష్ట్రలోని తాడోబా, తెలంగాణలో కవ్వాల్, ఛత్తీస్ గఢ్ లో ఇంద్రావతి
3) ఫార్మా, బయోటెక్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వచ్చే ఏడాదిలో హైదరాబాద్ లో ఏ సదస్సు జరగనుంది ?
జ: బయో ఏషియా సదస్సు – 2018
4) ప్రముఖులకు భద్రత కల్పించడాన్ని ఏ బలగాలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( CISF)
(NOTE: ఇప్పటివరకూ VIP ల భద్రతను CRPF, ITBP లు కల్పిస్తున్నాయి )
5) శబరిమలై సన్నిధానంలో పిల్లలు తప్పిపోకుండా కేరళ పోలీసులు, వోడా ఫోన్ కలసి ఏ విధానాన్ని అనుసరించనున్నాయి
జ: రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ను తగిలిస్తారు
6) నీటిపైన దిగడంతో పాటు ఎగిరే విమానం సీ ఫ్లేన్ ను స్పైస్ జెట్ ఎక్కడ  ప్రయోగించి చూశారు ?
జ: ముంబై తీరంలో
7) ఇటీవల భారీగా IFS కోడ్ లను మార్చిన బ్యాంక్ ఏది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8) మద్యం అమ్మకాలకు కనీస వయస్సును 21 నుంచి 23 యేళ్ళకి పెంచిన రాష్ట్రం ఏది ?
జ: కేరళ
9) తమిళనాడులో ఫ్లోరీ కల్చర్ పై ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఇజ్రాయిల్
10) ఢిల్లీలో ఆరోగ్య రంగంలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఏ దేశంతో భారత్ MOU కుదుర్చుకుంది ?
జ: క్యూబా
11)చైనాకు ఏ ఓడరేవును 99యేళ్ళ పాటు లీజుకు ఇస్తూ శ్రీలంక అధికారికంగా అప్పగించింది ?
జ: హంబన్ తోట

Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...

Education

Education Sandeep Velichala: 👤🌡➖➖➖➖➖➖➖➖➖ *స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్..జయంతి నేడు* ➖➖➖➖➖➖➖➖🌸🌸🍃 *★సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* ● స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం. ● అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్. *●సెల్సియస్ ఉష్ణ మాపకం* దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుక...